Sri Raja Rajeshwari Charitable Trust Vemulawada

Trust Donating Food during Covid19 Lockdown in Vemulawada.

 వారణాస్యాస్సమంక్షేత్రం

రాజేశ్వరమిహ దక్షిణే

అతోదక్షిణకాశీతి

నామ లేభే మహత్పరమ్." అన్నదానం సమందానం త్రి లోకేషు న విద్యతే."

• ప్రాణుల దేహం లో వైశ్వా నరాగ్ని పరం జ్యోతి యే ,జఠరాగ్ని లో అన్నం వేయడం అంటే యజ్ఞం లో ఆహుతులు వేయటం తో సమానం...

• ఈ మహత్ కార్యానికి చేయూత నివ్వండి.

• అన్న ప్రసాద వితరణలో పాల్గొని దాన శీలత అవకాశం పొందండి.

పన్నెండో రోజుకు చేరుకున్న ఉపహార పంపిణీ. కరోనా లాక్ డౌన్ సందర్బంగా శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పన్నెండో రోజున మధ్యాహ్నం బ్రాహ్మణ క్యారేజీ లు 10, సాయంత్రం ఉపహార ప్యాకెట్లు 130 విది నిర్వహణలో వున్న డాక్టర్లకు 12 పంపిణీ చేయటం జరిగింది. శ్రీ రాజ రాజేశ్వరీ ట్రస్ట్ వేములవాడ ధార్మిక సేవా కార్య క్రమాల లో పాల్గొంటున్న వారందరూ ధార్మిక సేవ లో భాగస్థు లే, వీరందరికీ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు, మరియు దివ్య ఆశీ స్సులు సదా వర్షించాలని మనసారా కోరుకుంటున్నాం

వేసవి తాపం పెరిగిపోవటం తో దాహార్తిని తీర్చుకునేందుకు మినిరల్ వాటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత క్లిష్ట పరిస్థితిలో ట్రస్టు ప్రారంభ దశలోనే సేవలో ముందంజ లో వుండటం తో పలువురు నాయకులు అధికారులు అభినందిస్తూ రానున్న కాలంలో మరిన్ని విన్నూత సేవలందిస్తారని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మామిడిపల్లి రాజన్న నీటి సరఫరా అవసరమైన ట్యాంకును అందించిన మాధవి రఘులను,ఉపహార నికి దాతలుగా వ్యవహరించిన వెంకట మురళి మాధవ్ శిరీష దంపతుల కు కృతజ్ఞతలు తెలిపారు.

రాజరాజేశ్వరి ట్రస్ట్ వారు నిరంతరంగా సమాజసేవ చేస్తున్నారు..

కాలు బయటపెట్టాలంటే భయపడే ఈ "కరోనా" కాలంలో ప్రాణాలకు తెగించి అన్నార్తులను ఆదుకుంటున్నారు...

సరైన సమయంలో స్పందించి ఆశయాలు వల్లించడమే కాదు ఆచరణలో ముందుంటామని నిరూపిస్తున్నారు..

ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉపహార పంపిణీ పదమూడో రోజుకు చేరుకుంది. ఈశ్వరగారి విశ్వనాథ్ దంపతులు దాతలుగా వ్యవహరించారు.

బ్రాహ్మణ భోజన క్యారేజీ 12 డాక్టర్లకు ఉపహారలు చపాతీ 13 ఇతరులకు ఉపహారం 120 దాతలుగా వ్యవహరించిన విశ్వనాథ్ దంపతులకు , తమ విలువైన సమయన్ని ట్రస్ట్ సేవలకు వినియోగిస్తూన్న గుమ్మి పవన్ గార్లకు ట్రస్టు చైర్మన్ డాక్టర్ రాజన్న కృతజ్ఞతలు తెలిపారు


శ్రీ రాజ రాజేశ్వరీ ట్రస్ట్ వేములవాడ ధార్మిక సేవా కార్య క్రమాల లో పాల్గొంటున్న వారందరూ ధార్మిక సేవ లో భాగస్థు లే,

వీరందరికీ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు, మరియు దివ్య ఆశీ స్సులు సదా వర్షించాలని మనసారా కోరుకుంటున్నాం.

ఇట్లు

శ్రీ రాజ రాజేశ్వరీ ట్రస్ట్ వేములవాడ నిర్వాహకులు.


Mission & Vision
( దూర దర్శత )

* సనాతన హిందూ ధర్మ కార్యకలాపాలను పరిరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో సానుకూల సేవా శక్తిగా ఎదగడం

* సనాతన ధర్మ పరిరక్షణ సేవా

* నిత్య అన్న ప్రసాదం

* ధార్మిక భవన నిర్మాణమునకు సన్నాహాలు

* దక్షిణ కాశీ వేములవాడ లో ధార్మిక కార్యముల నిర్వ హణ

* విద్యార్థుల లో యువతలో నైతిక స్పృహ కలిగించటం

* ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక సహాయము

* గ్రామ ప్రాంతాల లో ఆరోగ్య సేవా శిబిరాల నిర్వహణ.

* మన సాంస్కృతి, సాంప్రదాయాల పట్ల యువతకు అవగాహన సదస్సులు నిర్వహించుట....* Kindly support us for charitable causes.

* Affordable accommodation and holistic food facilities for pilgrims.

* Land acquisition and Construction of Dharmika Bhavan".

* We need more hands and hearts in service of Hindu Traditions.

*Donate, Volunteer and spread the word about SRRCT.

* To be a positive force in preserving and propagating Hindu Dharma activities.

* Nitya Anna daanam

* Programs on Hindu Tradition & Culture

* Health and Education camps in rural areas

Sri Raja Rajeshwari Charitable Trust Vemulawada


free counter